
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు తన కొత్త చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. గత ఏడాది రోడ్డు ప్రమాదం లో గాయపడిన తేజ్..కొన్ని నెలలుగా రెస్ట్ తీసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అంత సెట్ అవ్వడం తో తన 15 వ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. రిపబ్లిక్ తరువాత సాయి ధరమ్ తేజ్ కొత్త దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీలో నటించనున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ అంశాల నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్ లో మొదలైంది. ఇందుకు సంబంధించిన వీడియోని చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది.