Homeటాప్ స్టోరీస్నటిపై అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్

నటిపై అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్

Arunima Ghosh
Arunima Ghosh

కోల్ కతా కు చెందిన బుల్లితెర నటి , మోడల్ అరుణిమా ఘోష్ పై అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతున్న ఆకతాయి ని ఎట్టకేలకు అరెస్ట్ చేసారు కోల్ కతా పోలీసులు . ముఖేష్ షా అనే వ్యక్తి గతకొంత కాలంగా మోడల్ , నటి అరుణిమా ఘోష్ ని ఫాలో అవుతూ ఆమె ఎక్కడికి పోతోంది ఎవరిని కలుస్తోంది అన్న వివరాలను ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ అసభ్యకరమైన భాషలో కామెంట్స్ చేస్తున్నాడు .

అయితే మొదట్లో లైట్ గా తీసుకున్న అరుణిమా ఘోష్ అది కాస్త ఎక్కువ కావడంతో సహించలేక , అలాగే భయపడిపోయి పోలీసులను ఆశ్రయించింది . ఐపి అడ్రస్ తో ముఖేష్ షా అనే వ్యక్తిని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు . అయితే అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తూ వైద్య పరీక్షలను చేయించే ఆలోచన చేస్తున్నారట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All