Homeటాప్ స్టోరీస్విశ్వరూపం 2 రివ్యూ

విశ్వరూపం 2 రివ్యూ

vishwaroopam 2 movie reviewవిశ్వరూపం 2 రివ్యూ
నటీనటులు : కమల్ హాసన్ , పూజా కుమార్ , ఆండ్రియా
సంగీతం : గిబ్రాన్
నిర్మాతలు : కమల్ హాసన్ , రవిచంద్రన్
దర్శకత్వం : కమల్ హాసన్
రేటింగ్ : 2/ 5
రిలీజ్ డేట్ : 10 ఆగస్టు 2018

కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వరూపం 2 ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది . విశ్వరూపం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరి ఆ అంచనాలను ఈ విశ్వరూపం 2 అందుకుందా ? కమల్ ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించాడా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

రా ఏజెంట్ అయిన విసామ్ అహ్మద్ కాశ్మీరీ ( కమల్ హాసన్ ) పాకిస్థాన్ తీవ్రవాద శిబిరంలో తీవ్రవాదిగా చేరతాడు . అయితే అది ఆపరేషన్ లో ఒక భాగంగా తీవ్రవాదుల్లో కలిసిపోయి ఎప్పటికప్పుడు తీవ్రవాదుల దుశ్చర్యల గురించి భారత శిబిరానికి చేరవేస్తుంటాడు . అల్ – ఖైదా తీవ్రవాద సంస్థ హెడ్ ని పట్టుకునే క్రమంలో విసామ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు . అతడు వేసిన ప్లాన్ ఏంటి ? చివరకు అల్ ఖైదా చీఫ్ ని అంతం చేశాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కమల్ హాసన్
పూజా కుమార్
ఆండ్రియా

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్

నటీనటుల ప్రతిభ :

రా ఏజెంట్ గా కమల్ హాసన్ నటన అద్భుతం , అతడి నటన గురించి కొత్తగా చెప్పేదేముంది విలక్షణ నటుడు కమల్ దాంతో తన పాత్రలో ఉన్న అన్ని ఎమోషన్స్ ని అద్భుతంగా క్యారీ చేసాడు . పూజా కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది . ఆండ్రియా , శేఖర్ కపూర్ లు తమతమ పాత్రలకు న్యాయం చేసారు . ఇక విలన్ గా నటించిన రాహుల్ బోస్ మెప్పించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల్లో మెప్పించారు .

ఓవరాల్ గా :

కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన విశ్వరూపం 2013 లో సంచలన విజయం సాధించింది . ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైన ఆ చిత్రం ప్రేక్షక లోకాన్ని సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తింది . కట్ చేస్తే దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ విశ్వరూపం 2 మాత్రం ఆ స్థాయిలో మెప్పించలేక పోయింది . సింపుల్ కథ అయినప్పటికీ కథనంలో చాలావరకు తడబడ్డాడు కమల్ . స్క్రీన్ ప్లే అనుకున్న స్థాయిలో రాసుకోలేక పోయాడు దానికి తోడు స్లో నెరేషన్ తో కూడా ప్రేక్షకులు అసహనానికి గురవ్వడం ఖాయం . ఫస్టాఫ్ అనుకున్న విధంగా లేదు అయితే సెకండాఫ్ లో కొన్ని ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసే సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి తక్కువ నిడివి తోనే ఉండటంతో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకుండా పోయాయి . నటుడిగా విశ్వరూపం చూపించిన కమల్ దర్శకుడిగా మాత్రం తన స్థాయిలో రాణించలేక పోయాడు .

 

పంచ్ లైన్ : ఈ రూపాన్ని తట్టుకోవడం కష్టమే !

English Title: vishwaroopam 2 movie review

Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All