Homeటాప్ స్టోరీస్ఫ్రాంక్ వీడియో ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్

ఫ్రాంక్ వీడియో ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్

vishwak sen clarity on prank video
vishwak sen clarity on prank video

‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ చేసిన ఓ ప్రాంక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విద్యా సాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఫ్రాంక్ వీడియో చేసింది. ఈ వీడియో ఫై కొంతమంది విమర్శలు చేస్తుంటే..మరికొంతమంది విశ్వక్ కు మద్దతు తెలుపుతున్నారు.

ఈ ఘటన పట్ల ఓ న్యూస్ ఛానల్ లో డిబేట్ చేయడం..డిబేట్ జరుగుతున్న క్రమంలో విశ్వక్ సేన్ ను సదరు యాంకర్ ‘పాగల్ సేన్’ ‘డిప్రెస్డ్ పర్సన్’ అంటూ సంబోధించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాటలకు హార్ట్ అయిన విశ్వక్.. తనను పర్సనల్ గా టార్గెట్ చేసినందుకు పరువునష్టం దావా వేసే హక్కు ఉందని.. కానీ అలా చేస్తే వారికి తనకు తేడా ఏముందని విశ్వక్ అన్నారు. అలాంటి మాటలు అనొద్దని.. మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గట్టిగా చెప్పారు. దీంతో సహనం కోల్పోయిన సదరు యాంకర్.. ‘గెట్ ఔట్’ అంటూ తన షో నుంచి వెళ్లిపోవాలని గట్టి గట్టిగా అరుస్తూ విశ్వక్ సేన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విశ్వక్ బయటకు వచ్చి ఈ ఇష్యూ పై మరో ఛానల్ లో వివరణ ఇచ్చారు.

- Advertisement -

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన టీమ్ ఇది ప్లాన్ చేసిందని.. తనకు తెలిసినా సినిమాకు ప్రచారం అవసరం కాబట్టి అలా చేశానని విశ్వక్ అన్నారు. ఇది తన ఇంటికి దగ్గరలోనే జరిగిందని.. అది న్యూసెన్స్ కాదని.. అక్కడున్న వారందరూ ఈ ఫ్రాంక్ చూసి ఎంజాయ్ చేశారని.. ఆ క్యాన్ లో ఉంది పెట్రోల్ కాదు నీళ్ళని అందరికీ తెలుసన్నారు. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ లో భాగంగా ఏమైనా చేస్తానని విశ్వక్ అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All