Homeటాప్ స్టోరీస్విష్ణు విశాల్ సైకో థ్రిల్ల‌ర్!

విష్ణు విశాల్ సైకో థ్రిల్ల‌ర్!

విష్ణు విశాల్ సైకో థ్రిల్ల‌ర్!
విష్ణు విశాల్ సైకో థ్రిల్ల‌ర్!

సైకో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `రాట్స‌స‌న్‌`. త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో `రాక్ష‌సుడు` పేరుతో రీమేక్ చేస్తే ఇక్క‌డా స‌క్సెస్‌ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం మ‌రో సైకో థ్రిల్ల‌ర్‌తో విష్ణ విశాల్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై స్వ‌యంగా విష్ణు విశాలే నిర్మిస్తున్నారు.

ముర‌ళీ కార్తిక్ రూపొందిస్తున్న ఈ సైకో థ్రిల్ల‌ర్‌కు `మోహ‌న్‌దాస్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. శ‌నివారం ఈ చిత్ర టైటిల్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొదుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ సైకో కిల్ల‌ర్‌గా న‌టిస్తున్నట్టు తెలుస్తోంది.  టీజ‌ర్‌లో ఓ యువ‌తిని హ్యామ‌ర్‌తో కొట్టి చంపుతున్న దృశ్యాలు భ‌యంక‌రంగా వున్నాయి.

- Advertisement -

గాంధీజీ చెప్పి చెడు విన‌కు, చెడు చూడ‌కు, చెడు మాట్లాడ‌కు అనే త్రీ మంకీస్‌ని టీజ‌ర్‌లో చూపించారు. అలాంటి వ్య‌క్తుల్ని చంపే కిల్ల‌ర్‌గా విష్ణు విశాల్  చిత్రంలో క‌నిపిస్తారా?  లేక ఆయ‌న పాత్ర ఎలా వుంటుందనేది మిస్ట‌రీగానే వుంది. ఈ చిత్ర షూటింగ్‌ని ఈ నెల‌లోనే ప్రారంభించాల‌ని అనుకున్నా క‌రోనా కార‌ణంగా రెగ్యుల‌ర్ షూటింగ్‌ని వాయిదా వేశామ‌ని హీరో విష్ణు విశాల్ వెల్ల‌డించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All