Homeఎక్స్ క్లూసివ్ఒక బయోపిక్ లో దెబ్బతిన్నాడు ఇప్పుడు ఇంకోటా ?

ఒక బయోపిక్ లో దెబ్బతిన్నాడు ఇప్పుడు ఇంకోటా ?

Vishnu induri on another biopicఎన్టీఆర్ బయోపిక్ చేద్దామనే ఆలోచన బాలయ్యకు ఇచ్చింది విష్ణు ఇందూరి . రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు , నటుడు మురళీమోహన్ బంధువు అయిన విష్ణు ఎన్టీఆర్ బయోపిక్ తో షాక్ అయ్యాడు , అది ఇంకా మరిచిపోకముందే మరో బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నాడు . తమిళనాట ప్రభంజనం సృష్టించిన అమ్మ జయలలిత బయోపిక్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడు ఈ విష్ణు .

 

- Advertisement -

అయితే జయలలిత బయోపిక్ ని ఇప్పటికే ఇద్దరు ముగ్గరు ప్రకటించారు కూడా అందులో నిత్యామీనన్ జయలలిత గా నటిస్తున్న బయోపిక్ ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోంది అయినప్పటికీ విష్ణు జయలలిత బయోపిక్ చేయాలనే ఆలోచనతో ”తలైవి ” అన్న టైటిల్ రిజిస్టర్ చేయించాడు . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు కానీ ఎన్టీఆర్ మహానాయకుడు కానీ ఘోర పరాజయం పొందిన ఈ సమయంలో మళ్ళీ జయలలిత బయోపిక్ ఆలోచన ఎలా చేస్తున్నాడో అన్న చర్చ మొదలయ్యింది . జయలలిత జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే వాటిని సరిగ్గా తీయగలిగితే పెద్ద హిట్ అవ్వడం ఖాయం లేదంటే ఎన్టీఆర్ బయోపిక్ లాగే అవ్వడం ఖాయం .

English Title: Vishnu induri on another biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All