Homeటాప్ స్టోరీస్విశాల్ -అనీషా ల ఎంగేజ్ మెంట్

విశాల్ -అనీషా ల ఎంగేజ్ మెంట్

Vishal and Anisha gets engagedహీరో విశాల్అనీషాల ఎంగేజ్ మెంట్ ఈరోజు అతికొద్ది మంది సన్నిహితులు , బంధువుల మధ్య హైదరాబాద్ లో జరిగింది . ఇటీవలే తనకు కాబోయే భార్య అనీషా ని పరిచయం చేసిన విషయం తెలిసిందే . అనీషా రెడ్డి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి , విశాల్ పూర్తి పేరు విశాల్ రెడ్డి అన్న విషయం తెలిసిందే . తెలుగువాడు అయిన విశాల్ చెన్నై లో స్థిరపడటంతో తమిళ హీరోగా మారిపోయాడు .

 

- Advertisement -

హీరోగా తమిళనాట సత్తా చాటుతున్నప్పటికీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు విశాల్ . ఇక తన పెళ్లి నడిగర్ సంఘం భవనం కట్టాకే అని చెప్పిన విశాల్ ఆ మాటకు కట్టుబడి భవనం కంప్లీట్ అయ్యాక వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడు . ఇక త్వరలోనే చెన్నై లో అంగరంగ వైభవంగా నడిగర్ సంఘం భవనంలో పెళ్లి చేసుకోనున్నాడు విశాల్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All