HomeSportsభారత్ T20 సిరీస్ గెలవడంతో హీరోలుగా విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్

భారత్ T20 సిరీస్ గెలవడంతో హీరోలుగా విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్

భారత్ T20 సిరీస్ గెలవడంతో హీరోలుగా విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్
భారత్ T20 సిరీస్ గెలవడంతో హీరోలుగా విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్

ఆస్ట్రేలియాతో భారత్ T20 సిరీస్ గెలవడంతో హీరోలుగా మారారు విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్. ఆసియా కప్ ముందు వరకు ఫామ్ లో లేక అభిమానుల విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు అదే అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న రెండు జట్లుకు హైదరాబాద్‌లో జరిగిన మూడో మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మూడో మ్యాచుల్లో భారత్ గెలుసులో కీలకంగా వ్యవహరించింది మాత్రం సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అనే చెప్పుకోవాలి.

పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ను కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ తమ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ పై భారత క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిస్తుండగా.. సూర్య కుమార్ యాదవ్ పై విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సూర్య బ్యాటింగ్ పై విరాట్ ప్రశంసలు కురిపించాడు. ఎలాంటి పరిస్థితులను అయినా తనకు అనుకూలంగా మార్చేయగలడని సూర్యను పొగడ్తలతో ముంచెత్తాడు భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

- Advertisement -

సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 69 పరుగులు చేసి 191.7 స్ట్రైక్ రేటుతో నిలవగా, విరాట్ కోహ్లి 48 బంతుల్లో 63 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. సూర్యకుమార్‌ యాదవ్ ను ప్రశంసిస్తూ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేమ ఆట తన వద్ద ఉందంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ. గత కొద్ది నెలలుగా సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని తెలిపాడు. గ్రౌండ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను ఏమి చేయాలనుకుంటాడో, ఎలా బ్యాటింగ్ ఆడాలనుకుంటాడో ఫుల్ క్లారిటీతో ఉంటాడని, ఎలాంటి స్విచ్ వేషన్ లో అయినా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందంటూ కోహ్లీ కొనియాడాడు.

సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఆటతీరును చూశానని, ఇంగ్లాండ్ పై సెంచరీ సాధించాడని, ఆసియా కప్ లోనూ బ్యూటిఫుల్ బ్యాటింగ్ చేశాడంటూ కితాబిచ్చాడు. భయం లేకుండా ఏ టైంలో ఏ షాట్ ఆడాలో పూర్తి క్లారిటీతో ఆడతాడని విరాట్ కోహ్లీ.. సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాద్‌కు విచ్చేసిన భారత క్రికెటర్లను రామ్ చరణ్ ఈ సందర్భంగా తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు రామ్ చరణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి చరణ్ ప్రత్యేక విందు ఆతిథ్యాన్ని ఇచ్చారు. క్రికెటర్లను సన్మానించి వారితో ముచ్చటించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థ వార్తను ప్రచురించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All