Homeటాప్ స్టోరీస్వినయ విధేయ రామ రివ్యూ

వినయ విధేయ రామ రివ్యూ

Vinaya Vidheya Rama Movie Review
వినయ విధేయ రామ రివ్యూ

వినయ విధేయ రామ రివ్యూ :
నటీనటులు : రాంచరణ్ , కియారా అద్వానీ , ప్రశాంత్
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : డివివి దానయ్య
దర్శకత్వం : బోయపాటి శ్రీను
రేటింగ్ : 2. 5 / 5
రిలీజ్ డేట్ : 11 జనవరి 2019 

 
మాస్ దర్శకులు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ నటించిన  చిత్రం ” వినయ విధేయ రామ ” . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాంచరణ్ నటించిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
 
కథ : 
 
నలుగురు అనాథ పిల్లలకు దొరికిన మరో అనాథ రామ ( రాంచరణ్ ) , రామ కోసం నలుగురు ఆనాధలు కస్టపడి పెంచాలని అనుకుంటారు అయితే వాళ్ళని ప్రయోజకులను చేయడానికి రామ కస్టపడి అందరినీ చదివిస్తాడు . ఈ ఐదుగురు ఆనాధలు అన్నాదమ్ముల లాగా పెరుగుతారు . తన కుటుంబానికి కష్టం వస్తోంది అంటే ఎంతటి సాహసానికైనా తెగిస్తాడు రామ . బీహార్ లో భయ్యా ( వివేక్ ఒబెరాయ్ ) నేర సామ్రాజ్యానికి రారాజు . అయితే అలాంటి కరుడుకట్టిన నేరస్తుడి కి రామ కు ఎందుకు యుద్ధం జరిగింది ? తన కుటుంబం కోసం రామ ఏం చేసాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
 
హైలెట్స్ : 
 
రాంచరణ్
యాక్షన్ ఎపిసోడ్స్
కియారా గ్లామర్
 
డ్రా బ్యాక్స్ : 
 
కథ , కథనం
డైరెక్షన్
సంగీతం
 
నటీనటుల ప్రతిభ : 
 
వినయ విధేయ రామ గా రాంచరణ్ అద్భుతంగా నటించాడు . ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో అయితే రెచ్చిపోయాడు . రాంబో గెటప్ లో సూపర్ అనే చెప్పాలి . అయితే మెగా అభిమానులకు ఇది కనువిందు అనే చెప్పాలి . కియారా అద్వానీ కి పెద్దగా గుర్తింపు లేదు కానీ ఉన్నంత సేపు గ్లామర్ తో అలరించింది . ప్రశాంత్ , స్నేహ , ఆర్యన్ రాజేష్ , మధుసూదన్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు . విలన్ గా వివేక్ ఒబెరాయ్ మెప్పించాడు .
 
సాంకేతిక వర్గం : 
 
విజువల్స్ బాగున్నాయి , నిర్మాత పెట్టిన ఖర్చు తెరమీద కనిపించేలా కష్టపడ్డాడు ఛాయాగ్రాహకుడు . ఇక సంగీతం విషయానికి వస్తే …… దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో రెండు మాత్రమే బాగున్నాయి , నేపథ్య సంగీతం తో అలరించాడు కానీ దేవీశ్రీ ప్రసాద్ మార్క్ ని మాత్రం చూపించలేక పోయాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు బోయపాటి శ్రీను విషయానికి వస్తే ……. రాంచరణ్ ని యాక్షన్ ఎపిసోడ్స్ లో బాగానే చూపించాడు కానీ మిగతా సన్నివేశాల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు .
 
ఓవరాల్ గా : 
 

కేవలం మెగా ఫ్యాన్స్ కి మాత్రం నచ్చొచ్చు

- Advertisement -

 

English Title: Vinaya Vidheya Rama Movie Review
                      Click here for English Review

YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All