Homeటాప్ స్టోరీస్300 కోట్ల బడ్జెట్ అంటే వర్కౌట్ అవుతుందా ఆ హీరో పైన ?

300 కోట్ల బడ్జెట్ అంటే వర్కౌట్ అవుతుందా ఆ హీరో పైన ?

Vikram
Vikram

తమిళ స్టార్ హీరో విక్రమ్ తాజాగా నటిస్తున్న చిత్రం ” మహావీర్ కర్ణ ”. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ……. 300 కోట్లు . ఇంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అయితే విక్రమ్ కు గతకొంత కాలంగా వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి . చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి అలాంటి సమయంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి .

మహావీర్ కర్ణ చిత్రంలో విక్రమ్ కర్ణుడిగా నటిస్తున్నాడు . ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంతో ఈ భారీ బడ్జెట్ పెద్ద లెక్కలోకి రాదు అని భావిస్తున్నారు . హిట్ అయితే ఫరవాలేదు కానీ ప్రేక్షకులను మెప్పించేలా విక్రమ్ సినిమా లేకపోతే భారీ నష్టాలు తప్పవు . పైగా విక్రమ్ మార్కెట్ కూడా డల్ అయ్యింది . ఒకవేళ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటే మాత్రం రికార్డుల మోత మోగడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All