Homeటాప్ స్టోరీస్విజయ్ సినిమానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

విజయ్ సినిమానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

 vijay's sarkarఇలయ దళపతి విజయ్ నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు దాన్ని ఎలాగో అలా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు . ఇంకేముంది సినిమా విడుదలకు ముందు నుండి వివాదాలు మొదలై సినిమా విడుదల అయిన తర్వాత కూడా ఆ వివాదాలు తీవ్రం అవుతూనే ఉన్నాయి . అయితే ఇందులో రెండు రకాలుగా విజయ్ సినిమాకు ప్లస్ అవుతూనే ఉంది కానీ వివాదం అవసరమా ? అనేది విజయ్ ఆలోచన . విజయ్ నటించిన గత చిత్రం మెర్సల్ తెలుగులో అదిరింది గా విడుదల అయ్యింది ఆ సినిమాలో కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు ఉన్నాయని చాలా పెద్ద గొడవే అయ్యింది కట్ చేస్తే భారీ వసూళ్లు కూడా వచ్చాయి .

ఇక ఇప్పుడేమో సర్కార్ చిత్రంలో అమ్మ జయలలిత ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని వెంటనే వాటిని సినిమా నుండి తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అన్నా డిఎం కే నాయకులు . ఈ సర్కార్ చిత్రానికే నిన్న మొన్నటి వరకు కథ నాదని , దొంగిలించి సినిమా తీసారని వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు . అయితే కోర్టు బయట వ్యవహారం సెటిల్ చేసుకోవడంతో సద్దుమణిగింది . ఇక ఇప్పుడేమో అమ్మ వివాదం చుట్టుకుంది . మొత్తానికి ఏదో ఒక వివాదం విజయ్ చిత్రాన్ని టచ్ చేస్తూనే ఉంది .

- Advertisement -

English Title: vijay’s sarkar in dispute

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All