Homeటాప్ స్టోరీస్భారీ స్థాయిలో విజయ్ మాస్టర్ తెలుగు లెక్కలు

భారీ స్థాయిలో విజయ్ మాస్టర్ తెలుగు లెక్కలు

భారీ స్థాయిలో విజయ్ మాస్టర్ తెలుగు లెక్కలు
భారీ స్థాయిలో విజయ్ మాస్టర్ తెలుగు లెక్కలు

కోలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ ఇమేజ్ విజయ్ సొంతం. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా విజయ్ సినిమాలు 100 కోట్ల మేర బిజినెస్ చేస్తాయి. అంతే మొత్తంలో వసూలు కూడా చేస్తాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్. తమిళంలో భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న విజయ్ శరవేగంగా సినిమాలు చేస్తుంటాడు. గత దీపావళికి బిగిల్ చిత్రాన్ని వదిలిన విజయ్ ఈ వేసవికి మాస్టర్ సినిమాతో మన ముందుకు రానున్న విషయం తెల్సిందే. ఖైదీ చిత్రంతో అందరినీ మెప్పించిన లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మూడు ఫస్ట్ లుక్స్ విడుదల చేయగా వాటికి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ ను కూడా వదిలారు. అది తమిళనాట యువతను ఊపేస్తోంది. మాస్టర్ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది.

తమిళ థియేట్రికల్ రైట్స్ + డిజిటల్, శాటిలైట్, మలయాళ థియేట్రికల్ రైట్స్ + డిజిటల్, శాటిలైట్ కలిపి ఈ చిత్రం దాదాపు 200 కోట్ల మేర బిజినెస్ ను పూర్తి చేసినట్లు అక్కడి ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే తమిళంలో సూపర్ క్రేజ్ కలిగి ఉన్న విజయ్ కు తెలుగులో మార్కెట్ సంపాదించుకోవడం మాత్రం కుదరట్లేదు. గత కొన్ని చిత్రాలుగా సీరియస్ గా ఈ విషయాన్ని కన్సిడర్ చేసుకుని దాని ప్రకారం పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నా కానీ ఎందుకో చిత్రాలు విజయం సాధించట్లేదు. తమిళంలో పెద్ద విజయం సొంతం చేసుకున్న బిగిల్, తెలుగులో 10 కోట్లకు బిజినెస్ చేయగా 7 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

- Advertisement -

నిర్మాత మహేష్ ఎస్ కోనేరు 3 కోట్ల మేరకు విజయ్ చిత్రం ద్వారా నష్టపోయినా కూడా విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ కు దానికి మించిన బిజినెస్ చేయడం విశేషం. మాస్టర్ ను తెలుగు వెర్షన్ కు 12.5 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసాడు మహేష్ కోనేరు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All