
యావత్ సినీ లోకమే కాదు… ప్రపంచంలోని తెలుగు వారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఉండడానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అగ్ర హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడం.. వీరితో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్.. అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటించడం ..హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ సహా సముద్ర ఖని, శ్రియా శరన్ తదితరులు నటించడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి.
కేవలం ఇదే కాదు బాహుబలితో పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడం సినిమా ఫై మరింత అంచనాలు పెరిగేలా చేసాయి. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవుతుండడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న సమయంలో సినిమాలోని హైలైట్స్ ను రైటర్ విజేంద్రప్రసాద్ బయటకు చెప్పి ఆశ్చర్య పరిచారు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘ఈ కథలో రామ్ చరణ్, తారక్‌లు ఇద్దరూ ప్రాణ మిత్రులు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత మంచి స్నేహితులు. కానీ.. ఈ కథలో వీళ్లిద్దరి ఐడియాలజీ వేరు. సినిమా మొదట్లోనే ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాలు అన్న విషయం తెలుస్తుంది’ అని బయటకు చెప్పేసారు.