
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలనీ ప్రతి ఒక్క హీరో అనుకుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తమ అభిమాన హీరోతో రాజమౌళి సినిమా చేస్తే బాగుండని భావిస్తుంటారు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. ఈ తరుణంలో చిత్ర సక్సెస్ లో భాగంగా రైటర్ విజేంద్రప్రసాద్ మీడియా తో మాట్లాడుతూ..పవన్ – రాజమౌళి కలయికలో మూవీ గురించి స్పందించారు. దేనికైనా టైం కలిసి రావాలి అని దర్శకుడికి హీరోకు ఇద్దరికీ అనువైన సమయం దొరికితే ఆ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది అని తెలియజేశారు.
అలాగే పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా చేయడం అంత సాధ్యమయ్యే విషయం కాదు అని ఆయనతో సమానంగా మ్యాచ్ అయ్యే మరొక హీరో లేరని పవన్ కళ్యాణ్ మెగా హీరో అంటూ విజయేంద్రప్రసాద్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఇక కాలం కలిసి వస్తే తాను పవన్ కళ్యాణ్ కు కథ రాసే అవకాశం ఉండవచ్చు అని కూడా విజయేంద్రప్రసాద్ తెలిపాడు.