Friday, January 27, 2023
Homeఎక్స్ క్లూసివ్11 కోట్ల నష్టం వచ్చిందట

11 కోట్ల నష్టం వచ్చిందట

Vijay sethupathi lost 11 crores
Vijay Sethupathi

తమిళ నటుడు విజయ్ సేతుపతి మంచి ప్రతిభ ఉన్న నటుడు పైగా వరుస విజయాలు సాధిస్తున్నాడు హీరోగా దాంతో బాగానే సంపాదిస్తున్నాడు ఈ హీరో . అయితే బాగా సంపాదిస్తున్న ఈ హీరో 11 కోట్లు నష్టపోయాడట . విజయ్ సేతుపతి కి 11 కోట్ల నష్టం ఏంటి ? అని అనుకుంటున్నారా ? జుంగా అనే సినిమాని నిర్మించాడు విజయ్ సేతుపతి . అయితే సినిమా మొత్తం విదేశాలలో షూటింగ్ జరగడం , సినిమా ప్లాప్ అవ్వడంతో పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది దాంతో 11 కోట్లు నష్టపోయాడు .

- Advertisement -

ఇక ఆ 11 కోట్ల అప్పు తీర్చడానికి సినిమాలు చేస్తూ కష్టపడుతున్నాడు విజయ్ సేతుపతి . ఇతగాడు ఇలా సినిమాలు నిర్మించడం ఎందుకు , అప్పుల పాలు కావడం ఎందుకు ? అని అనుకుంటున్నారా ? యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనీ , మాలాంటి వాళ్ళని ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయడం వల్లే వచ్చాం కదా ! అందుకే నా ప్రయత్నం అని అంటున్నాడు . మంచి పనే కానీ మరీ గుడ్డిగా పెట్టుబడి పెడితే తిప్పలు తప్పవు . ఈ హీరో ఇటీవలే 96 అనే సూపర్ హిట్ చిత్రంలో నటించాడు . అలాగే చిరంజీవి నటిస్తున్న సైరా ….. నరసింహారెడ్డి చిత్రంలో కూడా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి .

English Title: Vijay sethupathi lost 11 crores

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts