Homeటాప్ స్టోరీస్విజ‌య్ `మాస్ట‌ర్` సంక్రాంతికి రేస్‌కి రెడీ!

విజ‌య్ `మాస్ట‌ర్` సంక్రాంతికి రేస్‌కి రెడీ!

విజ‌య్ `మాస్ట‌ర్` సంక్రాంతికి రేస్‌కి రెడీ!
విజ‌య్ `మాస్ట‌ర్` సంక్రాంతికి రేస్‌కి రెడీ!

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం `మాస్ట‌ర్`. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మాళ‌విక మోహ‌న‌న్ క‌థానాయిక‌. ఎక్స్‌బి ఫిల్మ్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 13న విడుద‌ల కాబోతోంది. ఇదే విష‌యాన్ని చిత్ర బృందం మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా విజ‌య్ సేతుప‌తి, విజ‌య్ వున్న డేట్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్ యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఓ మాస్త‌ర్‌, వీధిరౌడీ మ‌ధ్య సాగే యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కించారు.

- Advertisement -

గ‌త కొంత కాలంగా లాక్‌డౌన్ వ‌ల్ల రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి హీరో విజ‌య్ చేసిన అభ్య‌ర్థ‌న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ని ర‌న్ చేయాల‌ని ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఆంక్ష‌ల్ని స‌డ‌లించి 100  శాతం ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌లోకి అనుమ‌తించాల‌ని హీరో విజ‌య్ త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌ని స్వామిని విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All