Homeటాప్ స్టోరీస్మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ

మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . నిన్ను కోరి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ తాజాగా మజిలీ చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసాడు దాంతో ఈ దర్శకుడికి డిమాండ్ ఏర్పడింది . ఇక విజయ్ దేవరకొండ కూడా నిన్ను కోరి చిత్రాన్ని అలాగే మజిలీ చిత్రాన్ని చూసి శివ వర్కింగ్ పట్ల ఆకర్షితుడు కావడంతో ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది .

- Advertisement -

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని పూరిచేసే పనిలో పడ్డాడు , ఆ చిత్రం పూర్తయ్యాక క్రాంతి మాధవ్ సినిమా పూర్తి చేయనున్నాడు . ఆల్రెడీ క్రాంతి మాధవ్ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు . ఇక ఈ కాంబినేషన్ లో సినిమా అంటే 2020 లోనే కాబోలు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All