
రౌడీ హీరో విజయ్ దేవరకొండ డ్రెస్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి మూవీ తో యూత్ స్టార్ గా మారిన విజయ్ తనకంటూ సొంత బ్రాండ్ ను ఏర్పటు చేసుకున్నాడు. అందరి హీరోల మాదిరి గా కాకుండా డ్రెస్ స్టయిల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటుంటారు. అందుకే యూత్ ఫ్యాన్స్ ఈయన డ్రెస్ స్టయిల్ కు ఫిదా అవుతుంటారు. తాజాగా ఫార్మల్ అండ్ క్యాజువల్ డ్రెస్ లో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో లైగర్ మూవీని పూర్తి చేసాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నెలలో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగానే విజయ్…తన తదుపరి చిత్రం కూడా పూరి డైరెక్షన్లో చేయబోతున్నట్లు ప్రకటించాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన లో విజయ్ హీరో గా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ప్రకటన తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు.