Homeటాప్ స్టోరీస్బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రౌడీ స్కెచ్ ఇదే!

బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రౌడీ స్కెచ్ ఇదే!

Vijay Deverakonda fighter movie latest update
బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రౌడీ స్కెచ్ ఇదే!

విజయ్ దేవరకొండ.. ఆనతి కాలంలోనే స్టార్ డం సంపాదించుకున్న నటుడు. కెరీర్ మొదట్లోనే బ్లాక్ బస్టర్ లు రావడంతో విజయ్ కెరీర్ కూడా హై రేంజ్ లో సాగింది. మిడ్ రేంజ్ హీరోలలో క్రేజ్ ఉన్న టాప్ హీరోగా విజయ్ గురించి చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది విజయ్ నుండి వచ్చిన డియర్ కామ్రేడ్ తనకు ఊహించని షాక్ నే ఇచ్చింది. తెలుగులోనే కాక సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయగా అన్ని చోట్లా ఈ సినిమాకు చుక్కెదురైంది. డియర్ కామ్రేడ్ ఇచ్చిన ప్లాప్ తో విజయ్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ మరో ప్లాప్ పడితే విజయ్ కు స్ట్రగుల్స్ తప్పవు. డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ సమయంలోనే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను మొదలుపెట్టాడు విజయ్. అందుకే ఆ సినిమా ప్లాప్ ఈ చిత్రంపై పడింది.

ఆ ఎఫెక్ట్ తగ్గించడం కోసమే విజయ్ తన సినిమాను లేట్ చేసుకున్నాడు. ఔట్పుట్ విషయంలో పక్కాగా ఉండాలని భావించి వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ విషయంలో ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టలేదు. ఇప్పుడు షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన నాలుగు ఫస్ట్ లుక్స్ తో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నాడు విజయ్. ఎందుకంటే ఇప్పటికే పూరి జగన్నాథ్ తో ఫైటర్ కు కమిట్ అయ్యాడు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఒకవేళ వరల్డ్ ఫేమస్ లవర్ అటూ ఇటూ అయితే దాని ఎఫెక్ట్ కచ్చితంగా ఫైటర్ బిజినెస్ పై పడుతుంది. అలాగే ఫైటర్ అయ్యాక శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్ రాజుఁ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

- Advertisement -

ఈ మూడు సినిమాలతో విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అయ్యి తన ఫ్యాన్స్ ను మళ్ళీ అలరించాలని ఆశిస్తున్నాడు. మరి విజయ్ కోరిక ఈ మూడు సినిమాలు తీరుస్తాయేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All