Homeటాప్ స్టోరీస్టాక్సీ వాలా 3 రోజుల కలెక్షన్స్

టాక్సీ వాలా 3 రోజుల కలెక్షన్స్

Vijay devarkaonda's Taxiwaala 3 Days Collectionsవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీ వాలా చిత్రం ఎన్నో కష్టాలు పడి ఎట్టకేలకు ఈనెల 17 న థియేటర్ లలో విడుదలైన విషయం తెలిసిందే . మొదటి రోజునే పది కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించిన టాక్సీ వాలా రెండో రోజు, మూడో రోజు కాస్త తగ్గినప్పటికీ విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ని మాత్రం తగ్గించలేకపోయింది . దాంతో మూడు రోజుల్లో 20 కోట్ల గ్రాస్ వసూళ్ల ని అందుకున్నాడు టాక్సీ వాలా . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 8 కోట్లకు పైగా షేర్ వసూల్ చేయడంతో దాదాపుగా ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని రాబట్టేసింది . ఇక మిగిలింది బయ్యర్లు కొన్న డబ్బు తిరిగి రాబట్టాలి . మరో వారం రోజుల పాటు సరైన సినిమా ఏది కూడా లేదు కాబట్టి ఈ జోరు ఇలాగె సాగితే అందరు కూడా లాభాలు ఆర్జించడం ఖాయంగా కనిపిస్తోంది . తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన టాక్సీ వాలా అందరికీ లాభాలు తెచ్చేలా ఉన్నాడు . విడుదలకు ముందు సినిమా లీక్ కావడంతో టాక్సీ వాలా విజయం పై నీలినీడలు కమ్ముకున్నాయి అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయం సాధించాడు విజయ్ దేవరకొండ .

టాక్సీ వాలా వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి .

- Advertisement -

తెలంగాణ : 3. 80 కోట్లు

సీడెడ్ : 1.05 కోట్లు

ఈస్ట్ : 48 లక్షలు

వెస్ట్ : 45 లక్షలు

కృష్ణా : 65 లక్షలు

నెల్లూరు : 26 లక్షలు

గుంటూరు : 71 లక్షలు

వైజాగ్ : 95 లక్షలు

మొత్తం : 8. 35 కోట్లు

English Title: Vijay devarkaonda’s Taxiwaala 3 Days Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All