Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ చిరు సలహాలు పాటిస్తాడా

విజయ్ దేవరకొండ చిరు సలహాలు పాటిస్తాడా

vijay devarakonda will follow chiranjeevi adviceవిజయ్ గీత గోవిందం చిత్రంతో నువ్ స్టార్ హీరో అయ్యావు కాబట్టి ఈ విజయాన్ని , స్టార్ డం ని తలకు ఎక్కించుకోకుండా అభిమానుల ప్రేమని నీ గుండెల్లో పెట్టుకో అని సలహాలు ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో గీత గోవిందం చిత్ర విజయోత్సవ వేడుక జరిగింది కాగా ఆ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యాడు. ఆ సందర్భంగా విజయ్ దేవరకొండ కు వచ్చిన స్టార్ డం ని గురించి మాట్లాడుతూ దాన్ని కాపాడుకో అని సలహా ఇచ్చాడు. విజయ్ దేవరకొండ అగ్రిసివ్ హీరో మరి మెగాస్టార్ మాటలు వింటాడా ? పట్టించుకుంటాడా ? చూడాలి.

ఆగస్ట్ 15న విడుదలైన గీత గోవిందం భారీ వసూళ్ల ని సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన ఇమేజ్ రావడంతో ఈ భారీ వసూళ్లు వస్తున్నాయి దాంతో విజయ్ దేవరకొండ ని మెగాస్టార్ చిరంజీవితో , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోల్చుతున్నారు. ఇక ఈ విజయోత్సవ వేడుకలో విజయ్ దేవరకొండ ని స్టార్ హీరో గా కన్ఫర్మ్ చేశారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించాడు. ఇక అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు లు కూడా విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపించారు. దాంతో ఈ హీరో ఫుల్ ఖుషీ అవుతున్నాడు. అయితే చిరంజీవి ఇచ్చిన సలహాలు తప్పకుండా విజయ్ దేవరకొండ పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.

- Advertisement -

English Title: vijay devarakonda will follow chiranjeevi advice

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All