Homeటాప్ స్టోరీస్పొలిటికల్ లీడర్ గా విజయ్ దేవరకొండ

పొలిటికల్ లీడర్ గా విజయ్ దేవరకొండ

vijay devarakonda turned as political leaderవిజయ్ దేవరకొండ అదృష్టం మామూలుగా లేదు , పెళ్లి చూపులు చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిలో పడిన ఈ హీరో అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు ఇంకేముంది వరుసపెట్టి సినిమాలు సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు . ఇప్పటికే మూడు చిత్రాలు లైన్లో ఉండగా ఈరోజు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు . ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళ నిర్మాత కేఈ జ్ఙానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్ దేవరకొండ రాజకీయ నాయకుడి వారసుడి గా కనిపించనున్నాడు .

వారసుడిగా రాజకీయ రంగనా నిలపాలని తండ్రి భావిస్తే దానికి నా ఆలోచనా విధానం ఎలా ఉందో చూడు అంటూ తండ్రి కి తనదైన శైలి లో రాజకీయాన్ని నేర్పిన సరికొత్త నాయకుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నాడట . సమకాలీన రాజకీయ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆ చిత్ర యూనిట్ చాలానే ఆశలు పెట్టుకుంది . విభిన్న తరహా చిత్రాలను చేస్తూ కెరీర్ ని వైవిధ్యంగా మలుచుకుంటున్న విజయ్ కి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All