Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ సినిమా వాయిదాపడింది

విజయ్ దేవరకొండ సినిమా వాయిదాపడింది

vijay devarakonda taxiwaala release postponedఅర్జున్ రెడ్డి చిత్రంతో తిరుగులేని స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ దాంతో అతడి చిత్రాల పట్ల యూత్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు . ఇప్పటికే మహానటి చిత్రంలో మంచి పాత్ర పోషించి మార్కులు కొట్టేసాడు విజయ్ దేవరకొండ . అయితే ఇదే నెలలో 18 న టాక్సీ వాలా చిత్రం విడుదల కావాల్సి ఉండే అంతా సిద్ధం అని అనుకున్నారు కట్ చేస్తే రిలీజ్ సమయం దగ్గర పడిన ఈ సమయంలో తన టాక్సీ వాలా చిత్రం విడుదల కావడం లేదని ప్రకటించాడు హీరో విజయ్ దేవరకొండ .

రాహుల్ సాంకృత్యాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ గీతా ఆర్ట్స్ 2 , యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు దాంతో టాక్సీ వాలా పై అంచనాలు పెరిగాయి . మాళవిక శర్మ , ప్రియాంక జవాల్కర్ లు హీరోయిన్ లుగా నటించారు . విజయ్ దేవరకొండ కు ఈ టాక్సీ వాలా చిత్రంపై చాలా నమ్మకం ఉందట ! అయితే ఈనెల 18న మాత్రం టాక్సీ వాలా చిత్రం విడుదల కావడం లేదు , జూన్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నందున ఈనెల 18న విడుదల చేయడం లేదని అంటున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All