Homeఎక్స్ క్లూసివ్విజయ్ దేవరకొండ పెళ్లెప్పుడంటే

విజయ్ దేవరకొండ పెళ్లెప్పుడంటే

Vijay devarakonda talks about marriage
Vijay devarakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మాట్లాడాడు అయితే పెళ్లి ఇప్పుడే చేసుకోడట కాకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలని అనిపిస్తే అప్పుడు చేసుకుంటాడట పెళ్లి . ప్రస్తుతం నా ద్రుష్టి అంతా సినిమాల మీదనే ఉందని , సినిమాలనుండి పెళ్లి మీద గాలి మళ్ళినపుడు మాత్రమే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు . తాజాగా ఈ హీరో డియర్ కామ్రేడ్ అనే చిత్రం లో నటిస్తున్నాడు . తనకు బాగా అచ్చి వచ్చిన భామ రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది .

ప్రస్తుతం ఈ చిత్రం కాకినాడ సమీపంలో షూటింగ్ జరుపుకుంటోంది . ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా డియర్ కామ్రేడ్ షూటింగ్ జరుగనుంది . ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది . ఇక ఇటీవలే ట్రైన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్న సమయంలో గాయాలయ్యాయి . దాన్నుండి కోలుకున్నాడు విజయ్ దేవరకొండ . రిస్క్ తీసుకొని నటించడం ఇబ్బందే కానీ స్టార్ డం ఊరికే రాదు కదా ! అని అంటున్నాడు .

- Advertisement -

English Title: Vijay devarakonda talks about marriage

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All