
విజయ్ దేవరకొండ 11 వ చిత్రం ఈరోజు గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో లైగర్ మూవీని పూర్తి చేసాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నెలలో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగానే విజయ్…తన తదుపరి చిత్రం కూడా పూరి డైరెక్షన్లో చేయబోతున్నట్లు ప్రకటించాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన లో విజయ్ హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు కాస్త టైం పడుతుండడంతో..ఈ లోపు మజిలీ ఫేమ్ శివనిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.
ఈ మూవీ లో విజయ్ కి జోడిగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర ఓపెనింగ్ కార్య క్రమంలో ఈరోజు జరిగాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారట. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన ఖుషి టైటిల్‌ను ఈ చిత్రానికి అనుకోవడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారిగా నటించనుండగా సమంత కాశ్మీరి అమ్మాయిగా కనిపించబోతున్నట్లు వినికిడి.