Homeటాప్ స్టోరీస్జులై 15 న విజయ్ దేవరకొండ ఏం చెప్పబోతున్నాడు

జులై 15 న విజయ్ దేవరకొండ ఏం చెప్పబోతున్నాడు

Vijay Devarakonda riding bike on road without shirtజులై 15న హీరో విజయ్ దేవరకొండ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు . నాకు ఇంతవరకు సరైన షర్ట్ దొరకలేదు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టడమే కాకుండా షర్ట్ వేసుకోకుండా బైక్ పై వెళుతున్న స్టిల్ ఒకటి పెట్టేసాడు దాంతో రకరకాల స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి . ఓ అవార్డుల వేడుక సమయంలో రౌడీ క్లబ్ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ ని లాంచ్ చేసాడు ఈ హీరో కాగా ఇప్పుడేమో ఆ వెబ్ సైట్ లో యువతీయువకులు మెంబర్ గా చేరుతున్నారు దాంతో విజయ్ దేవరకొండ బిజినెస్ రూట్ లోకి వెళుతున్నాడేమో అన్న అనుమానం కలగక మానదు .

నాకు ఇంతవరకు సరైన షర్ట్ దొరకలేదు అని చెప్పిన ఉద్దేశం అలాగే షర్ట్ లేకుండా బైక్ పై వెళుతున్న స్టిల్ ని బట్టి ఏదో ఒక సినిమా తాలూకు ప్రమోషన్ లో భాగమా ? లేక రౌడీ క్లబ్ వెబ్ సైట్ గురించా ? ట్రెండ్స్ బిజినెస్ గురించా ? అన్నది మరో అయిదు రోజుల్లోనే తేలిపోనుంది .

- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరో అందునా యువతలో క్రేజ్ ఉన్న హీరో కావడం విశేషం . ప్రస్తుతం ఈ హీరో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు . కాగా టాక్సీ వాలా , గీత గోవిందం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . వాటితో పాటు నోటా కూడా రెడీ అవుతోంది . మరి ఈ మూడు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో చూడాలి .

English Title: Vijay Devarakonda riding bike on road without shirt

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All