Homeటాప్ స్టోరీస్రిలీజ్ డేట్ ప్రకటించిన విజయ్ దేవరకొండ

రిలీజ్ డేట్ ప్రకటించిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda NOTA confirmed release on october 5thఇటీవలే గీత గోవిందం చిత్రంతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ మళ్ళీ నోటా చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు . గతకొద్దిరోజులుగా నోటా చిత్ర విడుదలలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే . కాగా ఆ గందరగోళాన్ని పటాపంచలు చేయడానికి నేరుగా విజయ్ దేవరకొండ రంగంలోకి దిగాడు దాంతో అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. శశాంక్ వెన్నెలకంటి ఎపిసోడ్ కి రాజీ కుదర్చడంతో నోటా విడుదలకు రంగం సిద్ధం అయ్యింది . అక్టోబర్ 5న నోటా చిత్రం తెలుగు , తమిళ్ లో విడుదల అవుతోంది .

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి అనూహ్యమైన క్రేజ్ వచ్చింది . గీత గోవిందం చిత్రానికి ముందు నోటా చిత్ర పరిస్థితి వేరు గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత నోటా రేంజ్ వేరు దాంతో ఈ సినిమాకు విపరీతమైన బిజినెస్ జరిగింది . తెలుగు , తమిళ్ లో విడుదల అక్టోబర్ 5న అవుతుండటంతో ఈ సినిమా విజయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే విజయ్ నేరుగా తమిళ్ లో నటించిన చిత్రం కావడం ఒక కారణమైతే , రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడం మరో కారణం . విజయ్ దేవరకొండ సరసన మెహరీన్ నటించింది .

- Advertisement -

English Title: Vijay devarakonda NOTA confirmed release on october 5th

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All