Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ తెలుసా

విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ తెలుసా

vijay devarakonda new title dear comradeఅర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ . ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది . ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్నాడు . టాక్సీవాలా చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా , కొత్త దర్శకుడి తో చేస్తున్న సినిమా కూడా పూర్తి కావచ్చింది . కమ్మ భరత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ” డియర్ కామ్రేడ్ ” అనే టైటిల్ ని పెట్టారు .

డియర్ కామ్రేడ్ అనగానే ఇదేదో విప్లవాత్మక చిత్రమని అనుకోవద్దని , ప్రేమకథా చిత్రమని అయితే అందులో ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర బృందం . విజయ్ దేవరకొండ కు అర్జున్ రెడ్డి చిత్రం వల్ల మంచి ఫాలోయింగ్ ఏర్పడింది దాంతో ఈ డియర్ కామ్రేడ్ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు నెలకొనేలా ఉన్నాయి . మహానటి చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ టాక్సీ వాలా తో ఈ డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All