Homeటాప్ స్టోరీస్రౌడీ క్లబ్ లో చేరమంటున్న విజయ్ దేవరకొండ

రౌడీ క్లబ్ లో చేరమంటున్న విజయ్ దేవరకొండ

vijay devarakonda inviting fans into rowdy clubరౌడీ క్లబ్ లో మీ పేరు నమోదు చేసుకోండి అంటూ యువతకు సలహా ఇస్తున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో స్టార్ డం అందుకున్న హీరో విజయ్ దేవరకొండ . తాజాగా ”నోటా ” అనే చిత్రంలో నటిస్తున్నాడు . అయితే తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల రేసులో బెస్ట్ హీరోగా నిలిచాడు ఈ యంగ్ హీరో . అగ్ర హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , ఎన్టీఆర్ , ప్రభాస్ లతో పాటుగా విజయ్ దేవరకొండ ఉత్తమ హీరో కేటగిరీ లో పోటీపడుతున్నాడు .

దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు విజయ్ . అగ్ర హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , ఎన్టీఆర్ , వెంకటేష్ , ప్రభాస్ లతో పాటుగా నేను కూడా బెస్ట్ హీరో కేటగిరీ లో పోటీ పడటం అంటేనే అవార్డు గెలిచినంత సంతోషంగా ఉంది . ఇక ఆ అవార్డుల పోటీకి వెళ్ళడానికి నాతో పాటు ఒకరిని ఆ ఫంక్షన్ కు తీసుకెళ్తాను కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు ” www .rowdyclub. in ” లో వివరాలను పొందుపరచాలని , అలా పేర్లు నమోదు చేసుకున్న వాళ్లలో ఒకరిని ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ కు తీసుకెళ్తానని అంటున్నాడు . అందువల్ల కుర్రాళ్ళు మీ వివరాలను వెంటనే రౌడీ క్లబ్ లో నమోదు చేయండి లక్కీ ఛాన్స్ కొట్టేయండి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All