Homeఎక్స్ క్లూసివ్హీరో విజయ్ దేవరకొండకు గాయాలు

హీరో విజయ్ దేవరకొండకు గాయాలు

Vijay devarakonda injured in Dear comrade shooting
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ షూటింగ్ లో గాయపడ్డాడు , అయితే గాయాలు పెద్దవి కాకపోవడం …… భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాయి షూటింగ్ వర్గాలు . తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ” డియర్ కామ్రేడ్ ” . ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది . యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో పరుగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కాలి విజయ్ దేవరకొండ , అయితే ఆ సమయంలో కాలు స్లిప్ కావడంతో కిందపడ్డాడు .

అయితే పక్కనే ఉన్న షూటింగ్ యూనిట్ విజయ్ దేవరకొండ ని వెంటనే పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది . దాంతో కాలికి, చేయికి గాయాలయ్యాయి . ఇక తన చేతికి తగిలిన స్వల్ప గాయాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు . ఇప్పుడా ఫోటో వైరల్ అవుతోంది. సక్సెస్ ఊరికే రాదు అన్న మాట దానికి తగిలించాడు విజయ్ దేవరకొండ . గాయాలతో విజయ్ దేవరకొండ బయటపడటంతో విజయ్ అభిమానులు ఆందోళన చెందారు . మొత్తానికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు .

- Advertisement -

English Title: Vijay Devarakonda injured in Dear comrade shooting

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All