Homeఎక్స్ క్లూసివ్కాకినాడలో సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ

కాకినాడలో సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda hulchal in kakinada
Vijay Deverakonda

డియర్ కామ్రేడ్ చిత్రం కోసం కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న సందర్బంగా పనిలో పనిగా ఇతర పనులను కూడా చక్కబెట్టేస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ . రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ” గీత గోవిందం ” చిత్రం ప్రభంజనం సృష్టించడంతో ఈ జంటకు ఎనలేని క్రేజ్ వచ్చింది . దాంతో మళ్ళీ డియర్ కామ్రేడ్ లో జంటగా నటిస్తున్నారు . రష్మిక మందన్న క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోంది .

కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది . ఇటీవలే ట్రైన్ ఎపిసోడ్ చిత్రీకరించగా అందులో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు విజయ్ దేవరకొండ. దాంతో షూటింగ్ కి గ్యాప్ వచ్చింది అందుకే ఆ గ్యాప్ లో తన పర్సనల్ పనులు చక్కబెట్టాడు . ఈ హీరో కే ఎల్ ఎం ఫ్యాషన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఆ గ్యాప్ లో మరోసారి కె ఎల్ ఎం కోసం కాకినాడలో సందడి చేసాడు విజయ్ దేవరకొండ .తమ అభిమాన కథానాయకుడు కాకినాడ లో సందడి చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు విజయ్ దేవరకొండ ని చూడటానికి .

- Advertisement -

English Title; Vijay devarakonda hulchal in kakinada

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All