Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండలో జోష్ పెంచిన సక్సెస్

విజయ్ దేవరకొండలో జోష్ పెంచిన సక్సెస్

Vijay devarakonda happy with taxiwala success టాక్సీ వాలా విజయం విజయ్ దేవరకొండ లో సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది . ఈ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నాడు ఎందుకంటే నోటా డిజాస్టర్ అయ్యింది , టాక్సీ వాలా చిత్రం ఏమో మొత్తం లీక్ అయ్యింది దాంతో మానసికంగా చాలా క్రుంగి పోయాడు . ఒకవైపు టాక్సీ వాలా లీక్ అయ్యింది అనే బాధలో ఉండగానే నోటా తెలుగు , తమిళంలో విడుదల కావడం డిజాస్టర్ కావడం మరింత షాక్ కు గురిచేసింది . దాంతో టాక్సీ వాలా చిత్రం విడుదల అవుతుందా ? ఒకవేళ విడుదల అయినా సక్సెస్ అవుతుందా ? అన్న అనుమానం ఉండే విజయ్ కి కానీ ఊహించని విధంగా సక్సెస్ కావడంతో నిరాశ నిస్పృహలు పోయి వాటి స్థానంలో సరికొత్త జోష్ వచ్చింది .

ఊహించని హిట్ లభించడంతో ఆ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . ఒకవైపు ఇటీవలే గీత గోవిందం చిత్రం శతదినోత్సవం పూర్తి చేసుకోవడం , టాక్సీ వాలా హిట్ కావడం …… మంచి వసూళ్లు వస్తుండటంతో విజయ్ లో జోష్ వచ్చింది . ప్రస్తుతం సక్సెస్ టూర్ అంటూ తిరుగుతున్నాడు ఈ టాక్సీ వాలా . ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు . దాని తర్వాత ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తానని అంటున్నాడు మరి .

- Advertisement -

English Title: Vijay devarakonda happy with taxiwala success

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All