Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తున్నాడుగా

విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తున్నాడుగా

vijay devarakonda gives golden chance to his fansవాట్ ద ఎఫ్ సాంగ్ పెద్ద వివాదాన్ని రాజేయడంలో మరింత ఖంగారు పడిన ఆ చిత్ర బృందం ఆ పాటని యు ట్యూబ్ నుండి డిలీట్ చేసారు . కట్ చేస్తే ఆ పాటలోని వివాదాస్పద అంశాలను తొలగించి మళ్ళీ పాడారు అయితే ఇప్పుడా ఆపాటని మీలో ఎవరైనా సరే పాడి సింగర్ గా ఛాన్స్ కొట్టేయండి అంటూ ఛాన్స్ ఇస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ . బాగా పాడిన పాట ని సెలెక్ట్ చేసి అదే పాటని సినిమాలో పెడతామని అలాగే ఓ గిఫ్ట్ కూడా ఇస్తానని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ . తాజాగా ఈ హీరో నటించిన గీత గోవిందం చిత్రం లోనిది ఆ పాట .

ఇక ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈలోపు బాగా పాడిన పాటని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఔత్సాహిక గాయకులు ట్రై చేసుకోవచ్చు లక్కీ ఛాన్స్ ని ఉపయోగించు కోవచ్చు కూడా . విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు . గీత గోవిందం చిత్రానికి అనూహ్యంగా పబ్లిసిటీ రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది అయితే అదే సమయంలో విజయ్ దేవరకొండ పాడిన వాట్ ద ఎఫ్ సాంగ్ వివాదాస్పదం కావడంతో ఒకింత బాధపడ్డాడు కూడా . అందుకే నా కంటే బాగా పాడే వాళ్లకు సింగర్ గా ఛాన్స్ ఇస్తానని అంటున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

English Title: vijay devarakonda gives golden chance to his fans

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All