Homeగాసిప్స్అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ

అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda in forbes 2018 list
Vijay Devarakonda

టాలీవుడ్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకొని అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ . ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ సంస్థ భారతదేశం లోని సంపన్నుల జాబితా ని ప్రతీ ఏడాది విడుదల చేస్తున్న విషయం తెలిసిందే . తాజాగా 2018 సంపన్నుల జాబితా అంటూ ఓ లిస్ట్ విడుదల చేసింది కాగా అందులో విజయ్ దేవరకొండ కు స్థానం దక్కడం విశేషం . ఈ హీరోకు ఫోర్బ్స్ జాబితాలో దక్కిన స్థానం ఎంతో తెలుసా …… 72 వ స్థానం . వంద మంది లిస్ట్ ని ఈ సంస్థ విడుదల చేయగా అందులో విజయ్ దేవరకొండ 14 కోట్ల సంపాదనతో  72 వ స్థానంలో నిలిచాడు . తక్కువ సమయంలోనే ఆ స్థానంలో నిలవడం అంటే గొప్ప విషయమే మరి .

ఈ ఏడాది విజయ్ దేవరకొండ కు బాగా కలిసి వచ్చింది .  గీత గోవిందం చిత్రంతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు , అలాగే టాక్సీ వాలా తో 21 కోట్లకు పైగా షేర్ సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాడు . ఇక ఈ జాబితాలో మన టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ 24 వ స్థానంలో ఉన్నాడు ( సంపాదన 31. 33 కోట్లు ) 28 కోట్ల సంపాదనతో 28 వ స్థానంలో ఎన్టీఆర్ , 24 . 33 కోట్ల సంపాదనతో 33 వ స్థానంలో మహేష్ బాబు ,22. 5 కోట్ల సంపాదనతో 36 వ స్థానంలో నాగార్జున , 20 కోట్ల సంపాదనతో 39 వ స్థానంలో కొరటాల శివ , 15. 67 కోట్ల సంపాదనతో 64 వ స్థానంలో అల్లు అర్జున్ , 14 కోట్ల సంపాదనతో విజయ్ తో సమానంగా రాంచరణ్ కూడా 72 వ స్థానంలో నిలిచాడు .

English Title: Vijay devarakonda in forbes 2018 list
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All