Homeఎక్స్ క్లూసివ్విజయ్ దేవరకొండని క్యాష్ చేసుకుంటున్నారు

విజయ్ దేవరకొండని క్యాష్ చేసుకుంటున్నారు

Vijay devarakonda Dwaraka as Arjun Reddy in tamilపెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగింది దాంతో ఈ హీరో ఇమేజ్ ని బాగానే క్యాష్ చేసుకుంటున్నారు పలువురు నిర్మాతలు . తెలుగులో ద్వారక అనే చిత్రంలో నటించాడు విజయ్ దేవరకొండ అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది కానీ తమిళ వాళ్లకు తెలియదు కదా ! పైగా విజయ్ దేవరకొండ కు తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి ద్వారక చిత్రాన్ని తమిళంలో డబ్ చేస్తున్నారు.

 

ఇంతకీ తమిళ టైటిల్ ఏంటో తెలుసా …….. అర్జున్ రెడ్డి . అర్జున్ రెడ్డి అనే చిత్రం దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది అలాగే తమిళ్ , హిందీ లలో రీమేక్ కూడా అవుతోంది . అందుకే ఆ పేరుని వాడుకోవాలని డిసైడ్ అయ్యారు . ద్వారక చిత్రాన్ని తమిళ్ లో అర్జున్ రెడ్డి గా రిలీజ్ చేయబోతున్నారు . హిట్ అవుతుందా ? లేదా ? అన్నది పెడితే విజయ్ ఇమేజ్ ని క్యాష్ అయితే చేసుకుంటున్నారు బిజినెస్ కదా ! అందుకే.
English Title: Vijay devarakonda Dwaraka  as Arjun Reddy in tamil
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All