Homeఎక్స్ క్లూసివ్ఓటు వేయని విజయ్ దేవరకొండ

ఓటు వేయని విజయ్ దేవరకొండ

Vijay devarakonda doesnot cast his voteనోటా సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం సంచలనంగా మారింది . పైగా విజయ్ దేవరకొండ ని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించారు . ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పిన ఈ క్రేజీ హీరో నిన్న మాత్రం తన ఓటు ని వేయలేదు దాంతో నెటిజన్స్ విజయ్ దేవరకొండ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఓటు అన్నది బాధ్యత కానీ అసలైన వేల బాధ్యతని విస్మరించిన ఈ హీరో పై విమర్శలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి .

 అయితే ఎన్నికల సమయాన అసలు ఈ హీరో ఎక్కడా కనిపించలేదు . అయితే ఆమధ్య ఉభయ గోదావరి జిల్లాలలో డియర్ కామ్రేడ్ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నాడు మరి . ఇప్పుడు అక్కడే ఉన్నాడా ? లేక ఓటు వేయడం ఇష్టం లేక బయటకు రాలేదా ? కారణం ఏంటో విజయ్ కే తెలియాలి . మొత్తానికి ఈ రౌడీ ఓటు వేయకపోవడంతో పెద్ద దుమారమే రేగుతోంది . ఇటీవలే టాక్సీ వాలా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రం చేస్తున్నాడు .

- Advertisement -

English Title: Vijay devarakonda doesnot cast his vote

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All