Homeటాప్ స్టోరీస్కార్మికుడి పాత్రలో విజయ్ దేవరకొండ

కార్మికుడి పాత్రలో విజయ్ దేవరకొండ

Vijay devarakonda as singareni labour leader in kranthi madhav filmటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుడి పాత్రలో కనిపించనున్నాడు . తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం కొత్తగూడెం జిల్లాలో షూటింగ్ జరుపుకుంటోంది . సింగరేణి కార్మికుడి పాత్రలో నటిస్తున్న విజయ్ దేవరకొండ పై అక్కడ పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు క్రాంతి మాధవ్ . గత ఏడాది గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టిన విజయ్ దేవరకొండ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు .

ఒకటేమో భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ కాగా మరొకటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం . ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ కొత్తగూడెం లో జరుగుతోంది . దాంతో విజయ్ దేవరకొండ ని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు . డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక మందన్న నటిస్తుండగా ఈ చిత్రంలో మాత్రం రాశి ఖన్నా ,ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు .

- Advertisement -

English Title: Vijay devarakonda as singareni labour leader in kranthi madhav film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All