
విజయ్ దేవరకొండ 11 వ చిత్రం గురువారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మజిలీ ఫేమ్ శివనిర్వాణ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో విజయ్ కి జోడిగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని అయితే ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదని చాలా కొత్తగా అడ్వెంచరస్ స్పోర్ట్స్ డ్రామా గా సాగుతుందని అంటున్నారు.
అంతే కాకుండా ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ బైకర్ గా కనిపిస్తారని ఈ పాత్ర చాలా కొత్తగా వుంటుందని చెపుతున్నారు. అయితే సినిమా మాత్రం లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని కశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కించే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి ఇది నిజామా కదా అనేది చూడాలి.
ఇక విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా టార్గెట్ తో ఆయన చేస్తున్న మూవీ `లైగర్`. వెర్సటైల్ డైరెక్టర్ పూరి పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కాకర్యక్రమాలు జరుపుకుంటోంది. స్లమ్ ఏరియాలో వుండే ఛాయ్ వాలా ఎలా ఇంటర్నేషల్ ఛాంపియన్ అయ్యాడు?.. దేశానికి ఎలా పేరు తీసుకొచ్చాడు? అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.