Homeటాప్ స్టోరీస్విజయ్ బీస్ట్ మూవీ టాక్ ..

విజయ్ బీస్ట్ మూవీ టాక్ ..

Vijay Beast Movie talk
Vijay Beast Movie talk

నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రం ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తో పాటు పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

సినిమా చూసిన ప్రేక్షకులు , అభిమానులు బీస్ట్ వన్ మాన్ షో అంటున్నారు. ఫస్టాఫ్ మొత్తం విజయ్ మాస్ ఇంట్రో సీన్‌తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోయిందని, కామెడీ కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారని చెబుతున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం ఫస్టాఫ్‌కు భిన్నంగా ఉందని , ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్‌తోనే నడిపించారని అంటున్నారు. హీరో నటన, క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్ సీన్ బాగున్నాయట. అలాగే అరబిక్ కుతూ సాంగ్ హైలైట్‌గా ఉందని , బ్యాగ్రౌండ్ స్కోర్, కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీకి ప్లస్ అని అంటున్నారు. ఇక, కథలో కొత్తదనం లేకపోవడం, లాజిక్ లేని సీన్స్, లవ్ ట్రాక్ మైనస్‌గా మారాయని చెపుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All