Homeటాప్ స్టోరీస్F3 రిలీజ్ డేట్ ఎనౌన్స్.. పొంగల్ రేసు నుండి అవుట్..!

F3 రిలీజ్ డేట్ ఎనౌన్స్.. పొంగల్ రేసు నుండి అవుట్..!

Victory Venkatesh Varun Tej F3 Release Date Announced
 

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మూవీ F3. ఆల్రెడీ F2 సూపర్ హిట్ అవడంతో అదే కాస్ట్ అండ్ క్రూతో మరో కొత్త కథతో అనీల్ రావిపుడి మరోసారి మ్యాజిక్ చేసేందుకు వస్తున్నారు. F3లో సునీల్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాను F2 సెంటిమెంట్ తో సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కాని పొంగల్ రేసులో ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు వస్తున్నాయి. అందుకే సంక్రాంతిని వదిలి ఫిబ్రవరిలో F3 రిలీజ్ ఫిక్స్ చేశారు. F3 సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. F3 సినిమాలో సోనాల్ చౌహాన్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది.

- Advertisement -

ఫిబ్రవరి 25న F3 సందడి షురూ అవుతుంది. ఎఫ్2 లానే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All