Homeటాప్ స్టోరీస్దాసరి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అవార్డ్ కొట్టేసిన వేణు

దాసరి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అవార్డ్ కొట్టేసిన వేణు

దర్శకుడు అన్న పదానికి నిర్వచనం దాసరి నారాయణరావు . కథ , మాటలు , పాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం ఇలా పలు రకాల శాఖలను ఒంటి చేత్తో నిర్వహించిన ఘనాపాటి దాసరి . దర్శకుడికి ఓ స్టార్ ఇమేజ్ ని ఆపాదించిన వ్యక్తి , శక్తి దాసరి . 150 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డ్ ని సొంతం చేసుకున్న దాసరి నారాయణరావు అవార్డు ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల ని వరించింది . నీది నాది ఒకే కథ చిత్రంతో ప్రతిభాశాలిగా నిరూపించుకున్నాడు వేణు ఉడుగుల .

- Advertisement -

సాహిత్యం పై మంచి పట్టు ఉన్న వేణు కూడా దాసరి లాగే కథ , స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం ఇలా ప్రధాన మైన శాఖలను నిర్వహించగల సత్తా ఉన్న దర్శకుడు కావడం విశేషం . నీది నాది ఒకే కథ చిత్రంతో చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ఈ యువ దర్శకుడు తాజాగా విరాటపర్వం 1992 అనే చిత్రానికి శ్రీకారం చుట్టాడు . జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఆ చిత్రంతో టాలీవుడ్ ని షేక్ చేసే సంచలన హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నాడు . అయితే దాసరి పేరిట అవార్డులను ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవార్డు లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది . సామాజిక ఇతివృత్తం తో తెరకెక్కిన నీది నాది ఒకే కథ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన వేణు ని దాసరి యంగ్ టాలెంటెడ్ అవార్డు తో సత్కరించనున్నారు . ఈవేడుక త్వరలోనే పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరుగనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All