Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండతో తొలిప్రేమ దర్శకుడు

విజయ్ దేవరకొండతో తొలిప్రేమ దర్శకుడు

Venky atluri next with Vijay devarakondaతొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసిన దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా ఈ నెల 25 న విడుదలకు సిద్ధమైంది , కాగా తన తదుపరి చిత్రం కోసం పలువురు హీరోలు పొతే పడుతున్నారు కూడా . అయితే వెంకీ అట్లూరి మాత్రం క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ ప్రేమకథా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

విజయ్ దేవరకొండ కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు . అయితే విజయ్ దేవరకొండ ఒప్పుకున్న చిత్రాలు లైన్లో ఉన్నాయి కాబట్టి అవి పూర్తయ్యాక వెంకీ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో క్రేజీ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ . ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు . అది పూర్తయ్యాక క్రాంతి మాధవ్ సినిమాలో నటించనున్నాడు .

- Advertisement -

English Title: Venky atluri next with Vijay devarakonda ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All