Homeటాప్ స్టోరీస్తెలుగు చిత్రసీమలో మరో విషాదం : ప్రముఖ ఎడిటర్ మృతి

తెలుగు చిత్రసీమలో మరో విషాదం : ప్రముఖ ఎడిటర్ మృతి

తెలుగు చిత్రసీమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న అనారోగ్యం తో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడువగా..తాజాగా ఎడిటర్‌ పి వెంకటేశ్వరరావు (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

- Advertisement -

తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200 పైగా సినిమాలకు ఎడిటర్‌గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీ రామారావు నటించిన యుగంధర్‌, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, కెప్టెన్‌ కృష్ణ, ఇద్దర అసాధ్యులే వంటి పలు హిట్‌ మువీలకు ఆయన ఎడిటర్‌గా చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి, పి వాసు, మంగిమందన్, వైకె నాగేశ్వర రావు, బోయిన సుబ్బారావు వంటి ప్రముఖ దర్శకులతో వెంకటేశ్వర రావు కలిసి పని చేయడం జరిగింది. వెంకటేశ్వరరావు అంత్యక్రియలు గురువారం (జూన్‌ 22) చెన్నైలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెంటేశ్వరరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All