Homeటాప్ స్టోరీస్ప్లాప్ డైరెక్టర్ తో సినిమానా

ప్లాప్ డైరెక్టర్ తో సినిమానా

Venkatesh green signal to flop directorబొమ్మరిల్లు చిత్రం తప్ప మరో హిట్ లేదు బొమ్మరిల్లు భాస్కర్ కు , బొమ్మరిల్లు చిత్రం తర్వాత చేసిన సినిమాలన్నీ ఘోర పరాజయాలు అందుకున్నాయి అయితే ఒక్క పరుగు చిత్రానికి మినహాయింపు ఉంది , అది పెద్ద హిట్ కాదుకానీ హిట్ అయ్యింది . తమిళంలో కూడా ఓ సినిమా ట్రై చేసాడు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు దాంతో ఈ దర్శకుడికి సినిమాలు లేకుండాపోయాయి . అప్పటి నుండి బొమ్మరిల్లు భాస్కర్ పలువురు హీరోల దగ్గరకు వెళ్తున్నాడు కానీ ఎవరు కూడా సినిమా ఇచ్చే సాహసం చేయడం లేదు దానికి తోడు ఆరెంజ్ చిత్రం భారీ ప్లాప్ అవ్వడంతో నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బొమ్మరిల్లు భాస్కర్ ని పలు వేదికల మీద చీల్చి చెండాడాడు దాంతో కూడా కావచ్చు భాస్కర్ కు సినిమాలు లేకుండా పోయాయి .

- Advertisement -

అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం సీనియర్ హీరో వెంకటేష్ కు బొమ్మరిల్లు భాస్కర్ ఓ కథ చెప్పాడని అది వెంకటేష్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . ఏ హీరో కూడా భాస్కర్ కు ఛాన్స్ ఇవ్వడానికి భయపడుతున్న ఈరోజుల్లో వెంకటేష్ ఎలా ఛాన్స్ ఇచ్చాడో అంటూ ఆశ్చర్యపోతున్నారు . అయితే సురేష్ బాబు కథ ఓకే చేసాడంటే మామూలు విషయం కాదని చాలారోజులుగా భాస్కర్ కథ ని చెక్కి ఇప్పటికి ఓకే చేసాడని అంటున్నారు . అంతా బాగుంది కానీ ఇంకా పట్టాల మీదకు ఎక్కాలి కదా ! అప్పుడు ఓకే చేసినట్లు .

English Title: Venkatesh green signal to flop director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts