Homeఎక్స్ క్లూసివ్బిగ్ బాస్ 3 చేయడం లేదట

బిగ్ బాస్ 3 చేయడం లేదట

Venkatesh denied rumours on bigg boss 3
Venkatesh

బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా నేను చేయడం లేదని , నన్నెవరూ ఆ కార్యక్రమం గురించి అడగలేదని  స్పష్టం చేసాడు విక్టరీ వెంకటేష్ . బిగ్ బాస్ సీజన్ తెలుగులో కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ మొదటి సీజన్ కు యాంకర్ గా వ్యవహరించగా , రెండో సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు . ఇక ఇప్పుడు మూడో సీజన్ రెడీ అవుతోంది , ఆ మూడో సీజన్ కు వెంకటేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో వెంకటేష్ స్పందించాడు , ఖండించాడు .

వెంకటేష్ నటించిన ఎఫ్ 2 ఈరోజు విడుదలైంది . ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉంది . ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది .  ఇక ఎఫ్ 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు వెంకటేష్ . వెంకటేష్ బిగ్ బాస్ 3 చేయడం లేదని చెప్పాడు కాబట్టి , ఇక ఎవరు ఆ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్నారో చూడాలి.

English Title: Venkatesh denied rumours on bigg boss 3

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All