Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు రికార్డ్ ని బద్దలు కొట్టిన వెంకటేష్

మహేష్ బాబు రికార్డ్ ని బద్దలు కొట్టిన వెంకటేష్

 Venkatesh beats mahesh records in Nizamటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డ్ ని బద్దలు కొట్టాడు హీరో వెంకటేష్ . ఈ సీనియర్ హీరో నటించిన చిత్రం ఎఫ్ 2 . జనవరి 12న విడుదలైన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా నటించగా వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించింది . మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం నైజాం లో  22. 34 కోట్ల షేర్ ని రాబట్టగా ఎఫ్ 2 మాత్రం నెల రోజుల్లోనే 22 . 47 కోట్ల షేర్ ని రాబట్టింది .

 

- Advertisement -

దాంతో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం రికార్డ్ బద్దలైంది . పూర్తిస్థాయి వినోద ప్రధానంగా తెరకెక్కిన ఎఫ్ 2 ఇప్పటికి కూడా సరైన పోటీ చిత్రం లేకపోవడంతో మంచి వసూళ్లని రాబడుతోంది . వెంకటేష్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా రికార్డు సృష్టిస్తోంది ఎఫ్ 2 . నైజాం లో మహేష్ రికార్డ్ ని బద్దలు కొట్టిన వెంకటేష్ మరిన్ని రికార్డులపై కన్నేశాడు .

English Title: Venkatesh beats mahesh records in Nizam

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All