Homeటాప్ స్టోరీస్రానాకు తండ్రిగా విక్ట‌రీ వెంక‌టేష్‌?

రానాకు తండ్రిగా విక్ట‌రీ వెంక‌టేష్‌?

రానాకు తండ్రిగా విక్ట‌రీ వెంక‌టేష్‌?
రానాకు తండ్రిగా విక్ట‌రీ వెంక‌టేష్‌?

రానా దగ్గుబాటి న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం `అరణ్య. ప్ర‌భుసాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ట్రైలర్ బుధ‌వారం విడుద‌లైన వియం తెలిసిందే. అయితే ఈ ట్రైల‌ర్ ప్రారంభం త‌రువాత ఓ చిన్న పిల్ల‌వాడి గొంతు వినిపిస్తోంది. `ఏనుగులన్నీ తాత‌య్య ఫ్రెండ్సా నాన్నా..అయితే నువ్వు కూడా వాటిని ఫ్రెండ్స్‌లా చూసుకుంటావా? ` అని ఓ వాయిస్ వినిపించింది.

అది విక్ట‌రీ వెంక‌టేష్ వాయిస్ . ఈ వాయిస్ గ‌మ‌నించిన వారిలో మొద‌లైన ప్ర‌శ్న .. ఈ చిత్రంలో రానాకు తండ్రిగా విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించారా? అని. అయితే దీనిపై రానా తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ చిత్రంలో రానా తండ్రి పాత్రకు వెంకటేష్ వాయిస్ ఇచ్చాడని రానా స్వయంగా ధృవీకరించారు. గత రాత్రి వెంకటేష్ ఆరణ్య ట్రైలర్‌ను షేర్ చేసి ఇది అద్భుతంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు.

- Advertisement -

అయితే వెంకీ ట్వీట్‌ను ఉటంకిస్తూ రానా ఇలా వ్రాశాడు. `నా బాబాయ్ `అరణ్య`లో నా తండ్రి పాత్ర‌కు గాత్ర దానం చేశారు` అని వివ‌రించారు. అయితే ఈ చిత్రంలో తన తండ్రి పాత్ర పోషించిన నటుడిని రానా వెల్లడించలేదు. వెంకీ ఎవరికి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడో తెలుసుకోవాలంటే ఈ మూవీ విడుదల వరకు వేచి ఉండాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All