Homeటాప్ స్టోరీస్బాక్సింగ్ ట్రైనింగ్ కోసం ముంబై చెక్కేస్తున్న వరుణ్

బాక్సింగ్ ట్రైనింగ్ కోసం ముంబై చెక్కేస్తున్న వరుణ్

VarunTej
VarunTej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కమర్షియల్ గానే కాకుండా ఈ చిత్రం వరుణ్ కు పర్సనల్ గా మంచి పేరు తీసుకువచ్చింది. నెగటివ్ ఛాయలున్న పాత్రలో వరుణ్ చెలరేగిపోయాడు. దీని తర్వాత వరుణ్ స్పోర్ట్స్ డ్రామాకు కమిట్ అయిన విషయం తెల్సిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న విషయం తెల్సిందే. ఈ పాత్ర కోసం వరుణ్ బరువు కూడా తగ్గాల్సిన అవసరముంది. బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి వరుణ్ ముంబై చెక్కేసాడు. రెండు నెలల పాటు వరుణ్ తేజ్ ముంబై లోనే ఉండనున్నాడు. అక్కడ విదేశీ ట్రైనర్ దగ్గర బాక్సింగ్ లో శిక్షణ పొందనున్నాడు. దాంతో పాటు పాత్రకు అనుగుణంగా తన శరీరాన్ని కూడా తీర్చిదిద్దుకుంటాడట.

- Advertisement -

డిసెంబర్ లో మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి, జనవరి నుండి షూటింగ్ మొదలుపెడతాడు. అక్కడినుండి విరామం లేకుండా షూటింగ్ చేసి సమ్మర్ లో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేసారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సిద్ధూ మద్దా, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మించనున్నారు. బాక్సింగ్ నేపధ్యమైనా ఈ చిత్రంలో రొమాన్స్, యాక్షన్ అంటూ అన్ని అంశాలనూ టచ్ చేయనున్నారట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All