
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా ఫై కన్నేశారు. ప్రతి సినిమాను కూడా పాన్ ఇండియా తరహాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాలు భారీ విజయాలు సాధించగా..ఇప్పుడు ఇదే తరహాలో మిగతా హీరోలు కూడా ఉన్నారు. వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ప్రస్తుతం ఈయన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీ చేసాడు. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 3 కూడా వచ్చే నెలలో రాబోతుంది.
ఈ రెండు సెట్స్ ఫై ఉండగానే ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఓ మూవీ కి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు సోనీ పిక్చర్స్ ఇండియా భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ప్రాజెక్ట్ కు వరుణ్ ఓకే చెప్పారని అంటున్నారు. దేశభక్తిని చాటిచెప్పే ఈ చిత్రంలో కథానాయకుడు ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. తెలుగుతో పాటుగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని.. దీంతోనే వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారని టాల్ నడుస్తోంది. దసరా కానుకగా ఈ మూవీ ప్రకటన రాబోతుందని అంటున్నారు.