
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న 37 వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో అభిమానుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకకు నాగబాబు , వరుణ్ తేజ్ , జానీ మాస్టర్ , మెహర్ రమేష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ..చిన్నతనంలో రామ్ చరణ్ ఎప్పుడూ తనను కొట్టేవాడని, కానీ ‘చిరుత’ సినిమాతో ఆయనలో మంచి మెచ్యూరిటీ వచ్చిందని తెలిపారు. చిరంజీవి గారిలోని మెచ్యూరిటీ, కళ్యాణ్ బాబులో ముక్కుసూటితనం ఈ రెండు కలబోసుకుంటే రామ్ చరణ్ అంటూ మెగా అభిమానులను హూషారెత్తించారు వరుణ్ తేజ్. RRR స్క్రీన్‌పై చరణ్‌ని చూస్తున్నట్టు అనిపించలేదని, సాక్షాత్తు అల్లూరి సీతారామరాజును చూస్తున్నట్టు అనిపించిందని చెప్పారు. చివర్లో ”చరణ్ అన్నను ఎవరన్నా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే.. మీరందరితో పాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి. ఆ తర్వాత చరణ్ అన్నతో మాట్లాడొచ్చ” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయితే వరుణ్ ఈ వర్కింగ్ ఎవరికీ ఇచ్చాడని అంత మాట్లాడుకుంటున్నారు.